సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పల్లెపండుగ 2.0లో భాగంగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు నేడు, మంగళవారం వీరవాసరం మండలంలోని పలు గ్రామాల్లో సుమారు రూ 2 కోట్ల 32 లక్షల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. ఉత్తరపాలెంలో రూ 18.50 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన, కొణితివాడ గ్రామంలో రూ 13.50 లక్షల సీసీ రోడ్డు, జేఎస్ బి రోడ్డుకు శంకుస్థాపన, తోలేరులో రూ 37 లక్షలతో సీసీ రోడ్డు, జిఎస్ బి రోడ్డుకు శంకుస్థాపన, బిజి పాలెంలో రూ 17 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన, పంజా వేమవరంలో రూ 9.30 లక్షలతో జీఎస్ బి రోడ్డుకు శంకుస్థాపన, వడ్డిగూడెంలో రూ 35 లక్షలతో సీసీ రోడ్డు, వీరవాసరంలో రూ 66 లక్షలతో వాకింగ్ ట్రాక్, సీసీ రోడ్లు, జిఎస్ బి రోడ్డుకు శంకుస్థాపనకు చేశారు. అదే విధంగా వడ్డీగూడెంలో రూ 36 లక్షలతో హెల్త్ క్లినిక్ భవనం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ పల్లె పండుగ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టామని, మెరుగైన జీవనానికి కృషి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు,,మహిళలు పాల్గొన్నారు
