సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపటి నూతన ఏడాది ప్రారంభం నుండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం 3వ కొత్త జిల్లాగా రంపచోడవరం కేం ద్రం గా కొత్త జిల్లా ఏర్పా టుకు రంగం సిద్ధం అయ్యింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆస్తులు నష్టపోయే వారికీ పునరావాసమే లక్ష్యంగా జిల్లా ఏర్పాటు చేశారు. ఈ కొత్త జిల్లా ఏర్పాటుతో ఉమ్మడి గోదావరి జిల్లాలో వైశాల్యం దృష్ట్యా ఎన్నో మార్పులు చేసుకోనున్నాయి. కొత్తగా పోలవరం జిల్లా కేంద్రముగా రంపచోడవరం, ఎట పాక డివిజన్లతో 12 మండలాలతో 3,49,953 మంది జనాభాతో ఏర్పాటవుతోంది. దానిలో కొత్తగా గుర్తేడు మండలం ఏర్పాటు కానుంది. రెండు రెవెన్యూ డివిజన్లతో 12 మండలాలను పోలవరం జిల్లాగా ఏర్పాటు చేసారు. నేడు బుధ వారం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. దానికి అనుబంధంగా జిల్లా కలెక్టరు,ఎస్పీ, అధికారులు, వ్యవస్థలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చర్యలను తీసుకొంటుంది. కాబినెట్ ఆమోదించిన కొత్త మార్పులలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సామర్లకోట మండలం కాకినాడ ఆర్డీవో పరిధిలో నుండి పెద్దాపురం డివిజన్ కి మార్చారు. అలాగే కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గాన్ని రాజమ హేంద్రవరంలో విలీనం చేసారు.
