సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం భీమవరంలోని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కార్యాలయంలో నూతనంగా నియమితులైన భీమవరం పురాధీశ్వరి, శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి ఆలయ ధర్మకర్తల మండలి నూతన కమిటీ సభ్యులు మంత్రి శ్రీనివాస వర్మను మర్యాదపూర్వకంగా కలిసి కూటమి పార్టీల తమ ఎంపికకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి, శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. భీమవరం పరిసర ప్రాంతాల ప్రజల ఆరాధ్య దైవమైన మావుళ్ళమ్మ అమ్మవారి ఆశీస్సులతో, ఆమె సేవలో తరించి ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వసతులను మెరుగుపరచడంపై కమిటీ దృష్టి సారించాలని శ్రీనివాస వర్మ కోరారు. ఆలయ కమిటీ చైర్మన్‌గా నియమితులైన బొండాడ నాగభూషణంతో పాటు నూతన సభ్యులను మంత్రి శ్రీనివాస వర్మ శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నూతన ఆలయ కమిటీ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, రామాయణం శ్రీనివాసరావు, నాగ శిరీష, కారంపూడి ఆదిలక్ష్మి, సుబ్రమణ్య రాజు, లక్ష్మీ నిర్మల, ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
