సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మేజర్ పంచాయితీలో నేడు, బుధవారం జరిగిన నెలవారీ “ఎన్టీఆర్ భరోసా – సామాజిక భద్రత” పింఛన్ల పంపిణీ రేపు నూతన సంవత్సరం నేపథ్యంలో ఒక రోజు ముందుగా నేడు జరిగిన పంపిణి కార్యక్రమంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు స్వయంగా పాల్గొని వృద్దులకు, వికలాంగుల లబ్ధిదారులకు పింఛను లు అందజేయడం జరిగింది. ఎవరికైనా నేడు, పింఛన్ అందక పొతే, ఎల్లుండి జనవరి 2న స్థానిక వార్డు సచివాలయ సిబ్బంది అందిస్తారు. ఉండి గ్రామంలో 50 లక్షల రూపాయల జిల్లా పరిషత్ నిధులతో నూతనంగా నిర్మించనున్న 360 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నేటి సాయంత్రం రఘురామ శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాలలో స్థానిక కూటమి నేతలు, కొత్తపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకానికి కొత్త ఏడాది సర్వ శుభాలు కలగాలని, రఘురామా ‘2026’ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
