సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా న్యూఇయర్‌ సందడి అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా నూతన ఏడాది వేడుకలు చాల సబ్డు జరిగాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రం భీమవరంలో షాపుల వద్ద కేక్‌లు, బిర్యానికి మాత్రం డిమాండ్‌ పెరిగింది.. దానితో ఇంటిటికి పార్సిల్ చేసే అవకాశం లేక పలు హోటల్స్ ఆన్ లైన్ డెలివరీ లు క్యాన్సిల్ చేసిపారేశాయి. ఇక పలు షాపుల వద్ద ముగ్గులు వేసేందుకు కావాల్సిన రంగులు అమ్మకాలు బాగా జరిగాయి. గత రాత్రి ప్రజలు అందరు అపార్ట్మెంట్స్ లో, ఇండ్లకాడే కుటుంబ సభ్యులల్తో బిర్యానీ డ్రింక్ విందులల్తో సరిపెట్టారు. ప్రశాంత వాతావరణంలో యువత కేక్‌లు కట్‌ చేసేందుకు, న్యూఇయర్‌ శుభాకాంక్షలు తెలుపు కొంటున్నారు. మద్యం అమ్మకాలు మాత్రం బాగానే జరిగాయి. ఇక జిల్లా రాజధాని కేంద్రం భీమవరం లో అయితే విచిత్రంగా సందడి బాగా తగ్గింది. గతంలో సాయంత్రం 6 గంటల నుండి 10గంటల వరకు ఉండే మార్కెట్ రద్దీ ఈసారి కానరాలేదు. బ్రాండెడ్ షాపింగ్ లు, బట్టల షాపులు ఫ్యాన్సీ గృహోపకరణ వస్తువుల షాపుల్లో కూడా పెద్దగా బిజినెస్ లేదు. న్యూ ఇయర్ పార్టీలు కూడా పెద్దగా జరగలేదు.చర్చ్ లలో మాత్రం కిస్మస్ న్యూ ఇయర్ వేడుకలు జోరు కనపడింది. పబ్లిక్ పంక్షన్ లు మ్యూజికల్ నైట్స్ జాడ కనపడలేదు. పండ్ల వ్యాపారులు అందుబాటు ధరలలో అమ్మకాలు బాగా చేసారు. గతంతో పోలిస్తే పువ్వులు, బొకేలు వ్యాపారులు అమ్మకాలు కూడా తగ్గాయి అంటున్నారు. దేవాలయాల వద్ద నేటి ఉదయం భక్తులు సందడిగానే ఉన్నారు. ఇక భీమవరం .జిల్లా రాజకీయ రాజధాని కావడం రాష్ట్రంలో కీలక ప్రముఖులు, అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు కూడా ఇక్కడే ఉండటంతో నేటి ఉదయం వారి నివాసాల వద్ద సందడి మాత్రం యధావిధిగా జోష్ గానే జరిగింది. పట్టణంలో దూరప్రాంతాల నుండి వచ్చే వాహనాల రద్దీ కూడా ఎక్కువగానే ఉంది. పోలీస్ వ్యవస్థ మాత్రం బాగా పనిచేసింది. గత 2 రోజులు ముందు నుండి భారీ స్థాయిలో అన్ని ప్రధాన సెంటర్స్ లో కూడా పోలీస్ మోహరింపు జరిగింది. అయితే రాత్రి 12 గంటలకు పట్టణం అంత బాణాసంచా కాంతులతో నూతన ఏడాది 2025 కి ఘనంగా స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *