సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేటి, గురువారం ఉదయం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా కూటమి పార్టీల ప్రముఖులు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజకీయాలకు అతీతంగా నేతలు ప్రజలు, అధికారుల శుభాకాంక్షలు కోలాహలంతో సందడి నెలకొంది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఉదయం నుండి మద్యాహ్నం వరకు ఓపికకాగా వారి నుండి శుభాశీసులు అందుకొన్నారు. తెలుగు దేశం పార్టీ జిల్లా అడ్జక్షులు మంతెన రామరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి, జీల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి తదితరులు ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు. మంత్రి వర్మ మాట్లాడుతూ.. నర్సాపురం పార్లమెంటరీ ప్రజలు కనివిని ఎరుగని భారీ మెజారిటీ ఇచ్చి తనకు ఎంపీగా అధికారం ఇస్తే , ప్రధాని మోడీ మంత్రి పదవి ఇచ్చిన అపూర్వ అవకాశం ను ప్రజల సేవకు ఈ ప్రాంత అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని కొత్త ఏడాది ప్రజల కోసం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని అందరు బాగుండాలని అని అభిలషించారు.
