సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నూతన సంవత్సరం సందర్భంగా భీమవరం శివారులోని పెదమిరం లో ఉండి నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు నేటి గురువారం ఉదయం నుండి మద్యాహ్నం వరకు శుభాకాంక్షలు చెప్పటం కోసం రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ సి. నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి. సిగ్మా న్యూస్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. దీనికి తోడు ఉండి , భీమవరం నియోజకవర్గాల నుండి భారీ స్థాయిలో ప్రజలు , కూటమి నేతలు రాజకీయాలకు అతీతంగా నేతలు, అధికారులు వచ్చి శుభాభినందనలు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో వేదిక ముందు గుంపు గుంపులుగా అభిమానులు ఒక దశలో, ఆయనను కలవడానికి ఉత్సహపడటంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది వారిని క్యూ పద్దతిలో నియంత్రించి ఒకరి తరువాత ఒకరిని రఘురామా వద్దకు పంపడం జరిగింది. రఘురామ మాట్లాడుతూ.. 2025 లో ఉండి నియోజక వర్గ ప్రజలకు త్రాగునీరు రైతులకు కాలుష్యం లేని పంట నీరు అందించడానికి ఆక్రమణలు తొలగింపు లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకే వెళ్లానని.. ఇప్పుడు ప్రజలు అన్ని ప్రాంతాలలో ఆనందం వ్యక్తం చేస్తున్నారని,, ప్రభుత్వ నిధులు తక్కువైనా ఉండీ లో వంతెనలు రోడ్డులు నిర్మాణం కొనసాగేలా చర్యలు తీసుకొన్నానని, నేరాలు అదుపులో పెట్టడానికి వేలాది సీసీ కెమెరాలు ఏర్పాటు జరుగుతుందని, మంచి ఫలితాలతో రాష్ట్రంలోనే ఉండీ ని ఒక మోడల్ ఐకాన్ గా నియోజకవర్గంగా మీ అందరి సహకారంతో నిలబెడతానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను పాలకోడేరు సహకార బ్యాంకు చైర్మెన్. కొత్తపల్లి నాగరాజు, పోలీస్ భద్రతా సిబ్బంది పర్యవేక్షించారు
