సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో గత గురువారం నూతన ఏడాది ప్రారంభంగాదేవాలయాలు అన్ని ఆధ్యాత్మిక శోభతోభక్తులతో నిండిపోయాయి.అయితే అగ్ర భాగంలో పెదమిరం లో శ్రీ సాయి స్వర్ణ దేవాలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి హారతి 10 గంటల వరకు వెలది భక్తుల రద్దీ తో నిండిపోయింది. వేలాది సాయి భక్తులు అందరికి ఉదయం నుండి నాన్ స్టాప్ పంచభక్ష అన్నసమారాధన,మరియు భక్తుల సహకారంతో రాత్రి 10 రకాల టిఫిన్స్ తో వెజ్ బిర్యానీ లతో అందరికి‘సాయి ప్రేమ విందు‘అందించారు. ఇక పట్టణంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులతో పాటు టీడీపీ మాజీ ఎంపీ తోట సీతారామ లక్ష్మి, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంట్ పార్ధ సారధి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన ప్రెసిడెంట్ కోటికల పూడి చినబాబు, వంటి పలువురు ప్రముఖుల నివాసాలు ,కార్యాలయాలు కూడా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అభిమానులు శ్రేయాభిలాషులు శుభాకాంక్షల సందడితో నిండిపోయాయి.
