సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో నేడు, శుక్రవారం సీఎం ఆర్ఎస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నియోజకవర్గ ఇన్చార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మీ నిర్వహించారు. ఈసందర్భంగా తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ .. ఆరోగ్యశ్రీ పథకంలో లేని శస్త్ర చికిత్సలకోసం వైద్య ఖర్చులు చేసిన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, వార్డుల నుండి వచ్చిన దరఖాస్తులను ముఖ్యమంత్రి ఆర్థిక సహాయానికి తోట సీతారామలక్ష్మి సిఫార్సు ద్వారా ఈరోజు నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వీరవాసరం జడ్పిటిసి గుండాబత్తుల జయప్రకాష్ కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు రజక, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్స్ ఉప్పులూరి చంద్రశేఖర్ పామర్తి వెంకటరామయ్య, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు తదితరులు పాల్గొన్నారు.
