సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: న్యూఇయర్ సందడి లో సడేమియా అని తెలుగు వారికీ ఇష్టమైన సంక్రాంతి పండగ సినిమా సందడి మొదలైంది. ఈ పండక్కి ఎలాగైనా హిట్టు కొట్టాలని సంక్రాంతి మొనగాడు ‘కిక్’ పొందాలని.. ఏకంగా 7 సినిమాల రిలీజ్ లతో చిన్న పెద్ద హీరోలు పోటీ బరిలో ఉన్నారు. గతేడాది నూతన సంవత్సర ప్రారంభంలోనే సంక్రాంతి కి వస్తున్నాముతో..300 కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు విక్టరీ వెంకటేశ్. ఇక ఈసారి సంక్రాంతి కి అలాంటి వినోదాత్మక మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యారు మన శంకరవరప్రసాద్ గారు. ఈ మూవీని జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి తో కలసి.. దీనిలో వెంకటేష్ సహకారం కూడా తీసుకొంటున్నారు అలాగే ఎప్పుడూ లేనివిధంగా ఈసారి సంక్రాంతికి ఏకంగా ఏడు సినిమాలు విడుదలవుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజాసాబ్ సినిమా భారీ అంచనాలతో జనవరి 9న విడుదల కానుంది. మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇవే కాకుండా.. మాస్ మహరాజా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాన్ని జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. ఇక శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమాను జనవరి 14న అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు సినిమాను సైతం అదే రోజున విడుదల చేస్తున్నారు.ఈసారి తమిళ్ సినిమాలు సైతం డబ్ చేయనున్నారు. విజయ్ దళపతి నటించిన జన నాయకుడు సినిమాను జనవరి 9న, శివకార్తికేయన్ నటించిన పరాశక్తి జనవరి 10న విడుదల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *