సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొత్త ఏడాది ఆరంభంతోనే అకస్మాత్తుగా గల్ఫ్ లోని ముస్లీమ్ దేశాలలో అకస్మాత్తుగా అంతః కల్లోలాలు, యుద్ధ మేఘాలతో దాడులు, ప్రతిదాడులు తో అల్లకల్లోల వాతావరణం కనపడుతుంది. గత నాలుగు రోజులుగా ఇరాన్ దేశంలో ప్రజలు మధ్య ఘర్షణలు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు, సైన్యం వాటిని అణచివేతలు హింసాత్మకంగా కొనసాగుతుంది. ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలో రెండు శక్తిమంతమైన దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి మరో దేశం యెమెన్‌లో తాజా ఘర్షణలే దీనికి కారణం. యెమెన్‌ లో జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాలు చెరోవర్గానికి మద్ధతునివ్వడంతో రెండు రాజ్యాల మధ్య అంతర్యద్ధానికి దారితీస్తోంది. ఒకపుడు కలిసి నడిచిన రెండు దేశాలు ఇలా ఘర్షణకు దిగడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు దారితీస్తోంది. నిజానికి 2014లో యెమెన్‌లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఇక పాకిస్తాన్ లోకూడా పీఓకే మొదలు బెలూచిస్తాన్, కైబర్ కోనల్లో, స్థానిక ప్రజలు తిరుగుబాట్లు అంతర్యద్ధాలు ఉక్కిరి చేస్తున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *