సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగానేడు, శనివారం స్థానిక నరసయ్య అగ్రహారం బస్తీలో నిర్వహించిన ‘హిందూ సమ్మేళనం’లో ముఖ్య అతిధి కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లక్షకు పైగా హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయని, జిల్లాలో 50 చోట్ల, భీమవరంలో 16 చోట్ల ఈ సమ్మేళనాలు నిర్వహించడం విశేషమన్నారు. దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడటం కోసం, హిందూ సమాజం బలోపేతానికి కృషి చేయడం కోసం ఆర్ఎస్ఎస్ నిస్వార్ధంగా కృషి చేస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా హిందూ సమాజం ఐక్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి ఆశీర్వచనాలు అందిస్తూ, ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందన్నారు. “ధర్మో రక్షతి రక్షితః” అన్నట్లు మనం ధర్మాన్ని ఆచరిస్తే, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందని పేర్కొన్నారు. ​ప్రధాన వక్తగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ ప్రాంత సహా శారీరిక్ ప్రముఖ్ ఓలేటి రవికుమార్ RSSచేస్తున్న సామాజిక సేవలను వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *