సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నందమూరి బాలకృష్ణ (Balakrishna) బోయపాటి శ్రీను కాంబినేషన్స్ లో 3 బంపర్ హ్యాట్రిక్ హిట్ సినిమాలు వచ్చాక 4వ సినిమాగా వచ్చిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘అఖండ2: తాండవం’ (Akhanda 2). సినిమా మాత్రం బాలయ్య అభిమానులను మినహా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కొనుగోలు దారులు కు కూడా భారీ నష్టాలు మిగిల్చింది. గత డిసెంబర్ 12న విడులయిన ఈసినిమా 24 రోజులకే ఓటిటిలో రిలీజ్ కు సిద్ధం అయ్యింది. ఈసినిమాలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా తదితరులు నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో (netflix) స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్ సినిమాల ప్రియులను ఓటిటి లో ఈ సినిమా తప్పకుండా అలరిస్తుంది.
