సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అసెంబ్లీ ఉప సభాపతి రఘరామ కృష్ణంరాజు లో వ్యాపారవేత్త, రాజకీయ నేత, సంక్రాంతి బుల్లోడు..ప్రత్యర్థులను రచ్చ బండపై రచ్చ చేసే తెగింపు, నాటక రంగంలో సుయోధన సార్వభౌముడు ఇలా మాస్ట్ షేడ్స్ ఉన్నాయని అందరికి తెలిసిందే.. అయితే ఇప్పుడు తాజగా మరో కోణంలో స్టెప్స్ వీరుడుగా కనిపిస్తున్నారు. .తాజగా మీసం మెలేసి స్టెప్పు లు వేశారు. టాలీవుడ్ పాప్ సింగర్ స్మితా కొత్త ఆల్పబ్ సాంగ్‌లో నటించిన రఘురామ భీమవరంలో SRKRఇంజనీరింగ్ కాలేజీ లో సాంగ్ విడుదల కార్య క్రమానికి హాజరయ్యారు. స్మితతో కలిసి స్టేజ్‌పై డాన్స్ చేశారు. ఈ పాట సంక్రాంతికి మన భీమవరం గొప్పతనం తెలుగు వారికే కాదు ..తమిళ్ లో కూడా తమిళనాడు ప్రజలకు చూపెడుతుంది అన్నారు రఘురామా. ఇప్పటికే ఈ పాట రఘురామా స్టెప్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. రఘురామా కాలేజీలో విద్యార్థులతో కలసి సంబరాలు, కోలాటాలు నిర్వహించారు. భోగిమంటలు వెలిగించి వేడుకలను ప్రారంభించారు.
