సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని భీమవరం నియోజకవర్గం టిడిపి కార్యాలయంలో నేడు, సోమవారం వీరవాసరం, భీమవరం మండలాలు మరియు భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో పోలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇంచార్జి తోట సీతారామలక్ష్మి ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని ఇవ్వని హామీలను కూడా అమలు చేసుకుంటూరాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. ఎన్డీఏ కుటమీ ప్రభుత్వం 2019లో అధికారం నుంచి దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉందని తరువాత జగన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని చెప్పి, దాదాపు రూ.32 వేల కోట్లు ప్రజలపై భారం మోపరన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం వేల కోట్లు విలువైన ట్రూఅప్ భారాన్ని ప్రభుత్వం భరించడం జరిగిందన్నారు
