సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం త్యాగరాజ భవనంలో 107వ త్యాగరాజ అరాధనోత్సవాలను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ 106 ఏళ్లపాటు ఎంతో సంప్రదాయ బద్దంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్బంగా కళారత్న డా చింతా రవి బాలకృష్ణ బృందం కూచిపూడి వారిచే 25 మంది కళాకారులచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సుమారు 2 గంటలపాటు సాగిన నృత్య రూపకం 25 మంది కళాకారులచే ప్రదర్శించిన అద్భుత నాట్య సంగమం. మోహిని భస్మాసుర నృత్యం అందరిని ఆకట్టుకున్నాయి. నిర్వాకులు మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ వరకు ఆరాధనోత్సవాలు జరుగుతాయని, 7వ తేదీన ఉదయం పంచరత్న కీర్తనల ఆలాపన జరుగుతుందన్నారు. కార్యక్రమంలో చెరుకువాడ వెంకట్రామయ్య, కారుమూరి నరసింహ మూర్తి (చినబాబు), అరసవల్లి సుబ్రమణ్యం, వబిలిశెట్టి కనకరాజు, వబిలిశెట్టి పట్టాభిరామయ్యతదితరులు పాల్గొన్నారు.
