సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శతాబ్దాలుగా ఎన్నో గ్యాస్ లీక్ దుర్ఘటనలుకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ( Konaseema) ప్రసిద్ధి పొందింది. అయితే తాజగా నేడు, సోమవారం మకిలిపురం (Malikipuram) మండలంలోని ఇరుసుమండ గ్రామంలో ఉన్న ఓఎన్జీసీ పైపు‌లైన్ (ONGC Pipeline) నుంచి గ్యాస్ లీక్ అయి గాలిలోకి ఎగజిమ్మడంతో ఒక్కసారిగా మంటలు (Fire accident) చెలరేగాయి. అది చూసి గ్రామంలోని ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ టెక్నిల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నేటి మధ్యాహనానికి కూడా మంటలు ఆర్పే పని లో ఉన్నారు. అయితే అవి ఇంకా అదుపులోకి రాలేదు. గత ఏడాది ఆగస్టులో కూడా ఇదే గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లీక్ అయ్యింది. ఇక్కడ తరుచూ గ్యాస్ లీక్ అవుతున్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ గ్యాస్ లీక్ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్, ఎస్పీల‌తో ఫోన్‌లో మాట్లాడి గ్రామస్థులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్‌కి ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *