సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ట్రంప్ ఈసారి భారత్ ఫై అగ్గిపై గూగిలం అయ్యి ఇకపై భారత్ ఉత్త్పతులపై 500 శాతం సుంకాలు విదిస్తానని బెదిరించడంతో భారత్ స్టాక్ మార్కెట్ గత మూడు రోజులుగా భారీ భారీ నష్టాలకు గురి అవుతూ వస్తుంది. నిన్న గురువారం ఒక దశలో సెన్సెక్స్ 851 పాయింట్లు పతనమై 84,110.10 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 780.18 పాయింట్ల నష్టంతో 84,180.96 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 263.90 పాయింట్లు క్షీణించి 25,876.85 వద్ద ముగిసింది. వరుసగా గత నాలుగు సెషన్లలో రూ.9.19 లక్షల కోట్లు సంపద ఆవిరి అయ్యింది. కేంద్రం లోని మోడీ సర్కార్ డాలర్‌తో పోలిస్తే రూపాయి భారీ పతనం అవుతున్నప్పుడు మెతక ధోరణి అవలంబించకూడదని.. ఇప్పటికే కిన అమెరికా ఫై కాస్త కఠిన ధోరణికి అవలంబిస్తే తప్ప ట్రంప్ దూకుడు తగ్గదని మార్కెట్ విశ్లేషకులు పేరుకొంటున్నారు. మరి దీనికి అడ్డుకట్ట ఎక్కడ పడుతుందో..?
