సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం యూత్ క్లబ్ రోడ్డులోని నివేదిత విద్యాలయంలో స్వామి వివేకానంద 164వ జయంతి కార్యక్రమాన్ని స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు ముందుగా వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత ఆధారపడి ఉంటుందని, భారతదేశ ఔనత్యాన్ని, సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వా మివివేకానంద అని అన్నారు. భారతీయ ధర్మాన్ని, కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తంగా చేసిన ఘనత వివేకానందునికే దక్కుతుందన్నారు. విద్యార్థులు వివేకానందుని సాహిత్యం అధ్యయనం చేసి దానిని అనుసరించాలన్నారు. సేవా సమితి ప్రెసిడెంట్ వేగిరాజు శివవర్మ, కార్యదర్శి దాట్ల నారాయణ రాజు మాట్లాడుతూ బాలికల కోసం ఉచిత నివేదిత విద్యాలయాన్ని ఈ ప్రాంతంలో ప్రారంభించామని, బాలుర కోసం నరసింహాపురం ఉచిత విద్యాలయాన్ని ప్రారంభించాలని సంకల్పించామని, ఈ విద్య ఏడాది ప్రారంభిస్తామని అన్నారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు వేగేశ్న సోమరాజు, అల్లూరి సీతారామరాజు, దాట్ల కృష్ణంరాజు,కారుమూరి సత్యనారాయణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
