సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని నరసాపురం పార్లమెంట్ బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నేడు, సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామీణ ఉపాధి రంగాన్ని ఆధునికీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన VB–G RAM G (వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ – గ్రామీణ్) చట్టం గ్రామీణ పేదల జీవితాల్లో సమూల మార్పులు తీసుకువస్తుందని అన్నారు. 22 డిసెంబర్ 2025న చట్టరూపం దాల్చిన VB–G RAM G బిల్లుపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు – దిగుమర్రు (NH 165) జాతీయ రహదారి అభివృద్ధి పనులకు ఏడాది కాలంలోని అనుమతులు సాధించామని, కేవలం ఏడాది కాలంలోనే సర్వే పనుల నుంచి డీపీఆర్ (DPR) సిద్ధం చేసే వరకు అన్ని దశలను పూర్తి చేశామని వచ్చే ఫిబ్రవరి నెలలో టెండర్లు పిలవడం జరుగుతుందని మంత్రి శ్రీనివాస వర్మ ప్రకటించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *