సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పండుగ ముగిసాక (Sankranti trains ) హైదరాబాద్ నుండి పశ్చిమ గోదావరి జిల్లా మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను (special trains ) నడపడానికి రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. చర్లపల్లి- కాకినాడ (07480) టౌన్ రైలును ఈ నెల19వ తేదీ సోమవారం నడపనున్నారు. చర్లపల్లిలో ఉదయం 10 గంటలకు బయలుదేరి రాత్రి 9.30 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. కాకినాడ టౌన్ – చర్లపల్లి (07481) రైలు ఈనెల 19వ తేదీన రాత్రి 11:15 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలు దేరి భీమవరం మీదుగా మరుసటి రోజు ఉదయం 11:45 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైళ్ళు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి సామర్లకోట స్టేషన్లలో ఆగనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అలాగే విశాఖపట్టణం – విజయవాడ ల మద్య ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసారు (08567), విజయవాడ – విశాఖపట్నానికి (08568) జనవరి 13, 14, 16, 17, 18 తేదీలలో నడుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *