సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం బివి రాజు పార్క్ సెంటర్ స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం వద్ద భీమవరం పట్టణ తెలుగుదేశంపార్టీ ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలను టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంట్ పార్ధసారధి, నియోజకవర్గ ఇన్చార్జి పోలీట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మీ ప్రారంభించారు. సంక్రాంతి గొబ్బెమ్మ ముగ్గులు, కోలాటాలు, భోగిపళ్ళు, భోగి మంటను వేసిన అనంతరం వారు మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు టిడిపి నాయకులకు కూటమి నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి పండగని పురస్కరించుకుని పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న పట్టణ టిడిపి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మద్ధుల రాము చల్లబోయిన గోవింద్ నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో, టిడిపి రాష్ట్ర కార్యదర్శిలు కోళ్ల నాగేశ్వరరావు, వెండ్ర శ్రీనివాస్, ఏపీ కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పామర్తి వెంకటరామయ్య ఉప్పులూరి చంద్రశేఖర్ ఎండి షబీనా మాజీ సీనియర్ కౌన్సెలర్స్ మైలాబత్తుల హైజాక్ బాబు, విజ్జురోతు రాఘవులు తదితర నాయకులు విశేషంగా పాల్గొన్నారు.
