సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ లోని పురాణ ప్రాశస్యం ఉన్న ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి (Vijayawada Kanaka Durga ) వచ్చే. భక్తుల కోసం సంక్రాంతి శుభాకాంక్షలతో నేడు, మంగళవారం ఆన్‌లైన్ సేవలను అధికారికంగా ప్రారంభించింది. దర్శన టిక్కెట్లు, సేవా పూజలు, ప్రసాదం, వసతి గదుల బుకింగ్ వంటి అనేక సేవలను ఇకపై ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చని, క్యూలైన్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ డిజిటల్ సేవలను ప్రవేశపెట్టినట్లు దేవాదాయ శాఖ పేర్కొంది. నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో‘మన మిత్ర’ వాట్సాప్ సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిందివాట్సాప్ నంబర్ 9552300009ను వినియోగించుకోవాలని సూచించింది. దర్శనం, ప్రసాదం, పూజా సేవల వివరాలు వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉంటాయని తెలిపింది. పూర్తీ వివరాలకు అధికారిక వెబ్‌సైట్ : www.aptemples.ap.gov.in లో సంప్రదించాలని సూచించింది. శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఆన్‌లైన్‌లో లభ్యమవుతాయని ప్రకటించింది.
