సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి నేపథ్యంలో భీమవరంలో శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ వారి దేవాలయంతో పాటు అన్ని ప్రముఖ దేవాలయాలు భక్తులతో దూరప్రాంతాల అతిధుల ఆగమనంతో .. స్వామివార్ల, దేవేరుల దర్శనాలతో పండుగ శోభ కనపడింది. ఇక పురాణ ప్రాశస్యం ఉన్న ప్రపంచంలో రంగులు మారె ఏకైక శివలింగం గా ప్రసిద్ధి పొందిన గునుపూడిలోని .పవిత్ర పంచారామ క్షేత్రం లో నేడు, బుధవారం ధనుర్మాసం భోగి పండుగ సందర్భంగా శ్రీ సోమేశ్వర స్వామి వారి అలంకరణ రేగిపండ్లతో జరిగింది. ఆలయ ఆవరణలో పలువురు చిన్నారులఫై రేగిపళ్ళు ను తలపై నుండి జారవిడిచారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు దర్శించుకొంటున్నారు. ఇక వేలాదిగా భక్తులు ఉదయం నుండి గోధుమ రంగులో ఉన్న శ్రీ స్వామివారిని దేవేరులు ను దర్శించుకొంటున్నారు. ఆలయ ఆవరణ అంతా కార్లతో నిండిపోయింది.
