సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:నేడు, గురువారం సంక్రాంతి పండగ రోజు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్న్యూస్ ప్రకటించింది. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న డీఏ, (Dearness Allowance), డీఆర్ (Dearness Relief) తో పాటు కాంట్రాక్ట్ బిల్లులను క్లియర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం రూ.2,600 కోట్లనిధులను విడుదల చేసింది. ఈ డబ్బుతో ఉద్యోగుల డీఏ, డీఆర్ బకాయిల చెల్లించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. తాజా ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5.7 లక్షల మంది ఉద్యోగుల్లో ఒక్కొక్కరి ఖాతాల్లో సుమారు రూ.30 నుంచి రూ.60 వేల వరకు నిధులు జమ అయ్యే అవకాశం ఉంది.. లబ్దిదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసు సిబ్బంది సహా కొందరు కాంట్రాక్టర్లు కూడా ఉండటంగమనార్హం.
