సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడలో రూ.18వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్ అమ్మో నియా ప్రాజెక్టుకు నేడు, శనివారం CMచంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. ఫోటో ఎక్స్గిబిషన్ ను వీక్షించారు. తదుపరి ఏర్పా టు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘గ్రీన్ అమ్మో నియా.. భవిష్యత్తులో పెనుమార్పు నకు నాంది. పలుకుతుందని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి బాగా పెంచాలని ప్రధాని మోదీ కోరికపై 2014లోనే మా ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి నాంది పలికింది. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మో నియాకు నాంది పలికాం. ఇప్పుడు కాకినాడలో ఏర్పాటయ్యేది ప్రపంచం లోనే అతిపెద్ద గ్రీన్ అమ్మో నియా పరిశ్రమ. 2027 జూన్ నాటికి మొదటి దశ ఉత్పత్తి ప్రారం భమవుతుంది, అన్నారు
