సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ 30వ వర్ధంతి నిర్వహించారు. స్థానిక నేతలు స్థానిక వీరమ్మ పార్క్ వద్ద ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసంధర్బముగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, టీడీపీ పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధసారధి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటే తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రమే కాదు.. తెలుగు వారి గుండె చప్పుడు.. తెలుగువారి చరిత్ర, ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీక ఎన్టీఆర్ అని కొనియాడారు. అనంతరం స్థానిక నేతలతో కల్సి పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
