సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే ఫిబ్రవరి నెలలో తొలి సూర్య గ్రహణం విచిత్ర తరహాలో ఏర్పడనుంది. ఇది చాలా శక్తివంతమైన సూర్యగ్రహణం అంటున్నారు వేద పండితులు. ఈ సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడనుంది. అంతే కాకుండా ఇది అన్ని సూర్య గ్రహణాల కంటే భిన్నంగా సూర్యుని చుట్టూ ఒక వలయంలా రింగ్లా ఏర్పడనుంది. దృశ్య పరంగా కూడా అద్భుతమైన ఖగోళ సంఘటనను సూచిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎప్పుడూ ఏర్పడే సూర్య గ్రహణం మాదిరి కాకుండా, గుడ్రంగా రింగ్లా ఏర్పడి, దాని చుట్టూ అగ్ని వలయం ఏర్పడుతుందంట. అందుకే దీనిని అగ్ని వలయం గ్రహణం అని కూడా పిలుస్తారు.
