సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల బస్సుల తో రోడ్డు ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌చెరువు పరిధిలో నేటి బుధవారం తెల్లవారు జాము ఒంటిగంట సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విహారయాత్ర నుంచి తిరిగి వస్తున్న విద్యార్థులతో కూడిన రెండు బస్సులు, రెండు ట్రావెల్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ముందు బస్సు సడన్ బ్రేక్ వెయ్యడంతో వెనుక బస్సు వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు. వివరాలలోకి వెళితే నల్గొండ జిల్లా గుండ్లపల్లి గ్రామంలో ఉన్న మోడల్ ప్రభుత్వ పాఠశాల, కళాశాలకు చెందిన విద్యార్థులు మూడు రోజుల క్రితం విహారయాత్రకు బయలుదేరారు. మొత్తం 80 మంది విద్యార్థులు (40 మంది బాలికలు, 40 మంది బాలురు) 10 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు. రెండు బస్సుల్లో ప్రయాణిస్తూ అరకు, పాడేరు తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. తిరుగు ప్రయాణంలో విద్యార్థులు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలో రాజానగరం మండలం దివాన్‌చెరువు పరిధిలో ప్రమాదం చోటు చేసుకుంది..
