సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమలలో రథ సప్తమి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి శుక్రవారం నుంచి తిరుపతిలో మూడు రోజుల పాటు సర్వ దర్శన టోకెన్ల జారీని నిలిపివేసింది. ఈ టోకెన్లు జారీచేసే మూడు ప్రాంతాల్లో నిలిపివేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ప్రకటించింది. వచ్చే ఆదివారం(2026 జనవరి 26)న రథ సప్తమి వేడుకల నేపథ్యంలో అదే రోజు శ్రీవారిని దేవేరులతో 7 వాహనాలపై ఊరేగింపు నిర్వహిస్తారు. సందర్శకులను ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, గ్యాలరీల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *