సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ప్రైవేట్ ట్రావెల్స్ కావేరి బస్సులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురై వెంటనే దిగిపోవడం తో ప్రమాదం తప్పింది.. నరసాపురం నుంచి హైదరాబాద్ వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సులో గత బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సు నర్సాపురంలో మొదలవగానే ఏసీ పనిచెయ్యడం మొరాయించిందని, ఇక భీమవరం సెయింట్ మేరీస్ స్కూల్ వద్దకు రాగానే పొగలు రావడం మొదలయిందని ప్రయాణికులు వాపోయారు. ఏసీ కంప్రెషర్ బెల్ట్ నుంచి పొగ వచ్చినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. భీమవరం పరిధిలో ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆ ప్రాంత రవాణా శాఖ అధికారులు వెంటనే బస్సును అక్కడే నిలిపివేశారు. ప్రయాణకులు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *