సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం ఆనంద ఫంక్షన్ హాల్లో నేడు, ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా టిడిపి అధ్యక్షుడు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ ..టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు, ప్రధాని కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర అధ్యక్షుడు పళ్ళ శ్రీనివాస్ జిల్లా కమిటీ కసరత్తులో భాగంగా త్రిసభ్య కమిటీ ద్వారా జిల్లా అధ్యక్షునిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికల సమయంలో మంతెన రామరాజు అంకితభావంతో పనిచేశారని తిరిగి ఆయనను రెండోసారి అధ్యక్షునిగా అధిష్టానం నియమించడం సంతోషకరమని కూటమి నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ..నూతన జిల్లా కమిటీ సభ్యులు కూటమితో కలిసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల విజయానికి విశేష కృషి చేయాలన్నారు. టిడిపి పోలీట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్చార్జ్ తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ.. జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదాలో అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించిన వారిని గుర్తించి పదవులు ఇవ్వడం జరిగిందని పదవులు రాని వారు నిరాశ పడకుండా పార్టీ పటిష్టతకు పని చేయాలన్నారు. అనంతరం జిల్లా కమిటీ అధ్యక్షునిగా మంతెన రామరాజు ప్రధాన కార్యదర్శిగా పితాని మోహన్ రావు మరియు ఉపదక్షునిగా మామిడి శెట్టి ప్రసాద్ తో పాటు 9 మంది కార్యనిర్వాహక కార్యదర్శిలు, 9 మంది అధికార ప్రతినిధులు,9 మంది కార్యదర్శులు కోశాధికారి, కార్యాలయ కార్యదర్శి, మీడియా,సోషల్ మీడియా కోఆర్డినేటర్ 42 మంది ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మహిళా ఆర్థిక సహకార కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగా నాగరాజు, రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి,రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వెండ్ర శ్రీనివాస్, పాలకోడేరు సహకార బ్యాంకు చైర్మెన్ కొత్తపల్లి నాగరాజు తదితర నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *