సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చూస్తుండగానే ఈ జూన్ నెల ముగింపు కు చేరుకుంది. వచ్చే జూలై 1 నుండి అనేక ముఖ్యమైన ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఆధార్ కార్డు అప్‌డేట్, ఎల్‌పీజీ గ్యాస్ ధరలు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిబంధనలు, సిఎన్‌జి-పిఎన్‌జి, బ్యాంకు సెలవుల షెడ్యూళ్ల వరకు అనేక మార్పులు రానున్నాయి.వాటిలో ముఖ్యంగా; UIDAI కొత్త నోటిఫికేషన్ ప్రకారం, తమ ఆధార్ కార్డులో ఈమెయిల్ ఐడిని అప్‌డేట్ చేసుకోని వారికి, జూలై 1 నుండి రాబోయే 6 నెలల పాటు తమ ఈమెయిల్ ఐడిని ఉచితంగా( గతంలో 75 రూపాయలు తీసుకొనేవారు) అప్‌డేట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ సౌకర్యం జూలై నుండి డిసెంబర్ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ జూన్‌లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ. 53.50 వరకు పెంచారు. దీనికి అదనంగా 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ల ధరను కూడా పెంచారు. మరి గల్ఫ్ యుద్ధం ముగిసింది. జూలై 1 నుంచి ఎల్పీజీ ధరలు మళ్లీ మారే అవకాశం ఉంది.ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF), CNG, PNG ధరలను కూడా జూలై ప్రారంభంలో సవరించే అవకాశం ఉంది. జూలై 1న కొత్త ధరల ప్రకటన రవాణా ఖర్చులు, విమాన ఛార్జీలపై ప్రభావం చూపవచ్చు….వచ్చే జూలైలో బ్యాంకులకు ఏకంగా 12 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. వీటిలో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు 6 రోజులు వారపు సెలవులుగా ఉంటాయి.
