సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వరుసగా కుదేలు అయ్యి తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న భారత దేశీయ మార్కెట్(stock market ). లో తాజగా యూరోపియన్ దేశాల సమైక్యత తో కుదిరిన భారీ వాణిజ్య డీల్ నేపథ్యంలో నిన్నటి నుండి కాస్త లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్ నేడు బుధవారం మరింత లాభాల బాటలో పయనిస్తుంది. గత సెషన్ ముగింపు (81,892)తో పోల్చుకుంటే నేడు బుధవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఒక దశలో 600 పాయింట్లకు పైగా లాభపడి 82,500 మార్క్ దాటింది. అయితే ఆ తర్వాత అమ్మకాల కారణంగా కిందకు దిగి వచ్చింది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో 335 పాయింట్ల లాభంతో 82,199 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 104 పాయింట్ల లాభంతో 25,279 వద్ద కదలాడుతోంది (stock market ).నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 293 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 321 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 91.60గా ఉంది.
