సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:తిరుమల లడ్డు నెయ్యిపై సీబీఐ చార్జిషీట్ రిపోర్ట్ బయటకు రావడంతో నేడు, గురువారం ఉదయం నుండి అంబటి, భూమన, పేర్ని నాని వంటి వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో చంద్రబాబు పవన్ లపై విరుచుకుపడుతున్నారు. ఆ వెంకటేశ్వర స్వామికి , హిందువులకు,జగన్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీటీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు ముందుగా ఆరోపించినట్లుగా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని కేంద్ర సంస్థ సీబీఐ రిపోర్టు ఇచ్చిందని.. ఇప్పడు ఏమంటారు? ప్రపంచం లో ఏ రాజకీయ నాయకుడు ఇంత రాక్షసంగా వ్య వహరించలేదు..జగన్ ను దెబ్బ తీసే కుట్రలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర లడ్డు ప్రసాదాన్ని ఇరికించేసాడు. దానికి లోకేష్, పవన్ ఇంకా తీవ్ర స్థాయిలో లడ్డు ప్రసాదాన్ని ఆవు,.. జంతు కొవ్వులు కలిపేశారని ప్రచారం చేసి.. సంప్రోక్షణలు ఆలయ మెట్లు కడిగారు. ఇప్పుడు వాస్తవం తెలిసింది కాబ్బటి చంద్రబాబు గుండు చేయించుకొని , పవన్ తిరుమలలో అన్ని వీధులు స్వయంగా నీటితో కడిగి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. నెయ్యిలో ..పామాయిల్ వాడారని సిబిఐ పేర్కొందని అయితే నిజానికి బోలె బాబా డైరీ తో తాము కొత్తగా ఒప్పదం ఏమి చేసుకోలేదని అంతకు ముందు గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో బోలెబాబా డైరీ తో చేసుకొన్నా అదే ఒప్పందాన్ని మా హయాంలో కొనసాగించామని, తమను దేవుడి పేరుతొ పెద్ద కుట్ర లో చంద్రబాబు ఇరికించాలని చూసారని శ్రీ వెంకటేశ్వర స్వామి కాపాడారని రాజకీయాల కోసం ఈ తప్పుడు ప్రచారం చేసినవారిని కూడా శ్రీవారు వదిలిపెట్టారని భూమన వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *