సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం లో నేడు, గురువారం హుండీ తెరచి లెక్కించారు . గత 26 రోజులకు కాలానికి భక్తులు హుండీల ద్వారా డబ్బు రూపంలో సమర్పించిన కానుకల మొత్తం ఆదాయంపలు దేశముల విదేశీ కరెన్సి శ్రీ అమ్మవారికి హుండీల ద్వారా 59,25,412. అక్షరాలా ‘యాభై తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల పన్నెండు రూపాయలు.. లభించగా బంగారం 45 గ్రాములు 100 మిల్లీగ్రాములు, వెండీ 210 గ్రాములు మరియు విదేశీ కరెన్సి సమర్పించుకున్నారు. సింగరాయపాలెం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ జి గంగా శ్రీదేవి పర్యవేక్షణలో జరిపిన ఈ లెక్కింపులో ఆలయప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ,, ఆలయ ధర్మకర్తలు చైర్మన్ బొండాడ నాగ భూషణం మరియు ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్ ,u మీనాక్షి, శిరీష,పాపోలు ఏడుకొండలు,ఎమ్ గుణేశ్వరరావు,కారెంపూడి ఆదిలక్ష్మి,జి రమణ,వై సత్యవతి, సుబ్రహ్మణ్యంరాజు భీమవరం దేవదాయ ధర్మదాయశాఖ తనికిదారు వి వెంకటేశ్వరరావు, తోట శ్రీనివాస్, సత్యనారాయణ రాజు,కర్రి శ్రీనివాస్ మరియు స్టేట్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరాజు, పోలీస్ సిబ్బంది ఆలయ సిబ్బంది పాల్గొన్నారని పోలీస్ సిబ్బంది పర్యవేక్షించారనిఆలయ సహాయ కమీషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
