సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: చిరంజీవి హీరోగా వెంకటేష్ ప్రత్యేక పాత్రలో సంక్రాంతి పండుగకు వచ్చి ఘన విజయం; సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాకు తెలంగాణాలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు హోంశాఖ జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ న్యాయవాది చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, ( గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రీమియర్ షో లు క్రింద భారీ మొత్తంలో ప్రేక్షకుల నుండి డబ్బులు వసూళ్లు చెయ్యకూడని తీర్పు ఉల్లంఘిచారని..) ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. ఇకపై సినిమా టికెట్ల ధరల పెంపు నిర్ణయం విడుదలకు 90 రోజులు ముందే ఉండాలని,మధ్యంతర ఉత్తర్వులివ్వడంతో పాటు, టికెట్ రేట్లు పెంచిన వసూళ్లు వివరాలు కోరుతూ షైన్ స్క్రీన్ ఇండియా ఎల్ఎల్పీకి నోటీసులు జారీ చేశారు. ఈక్రమంలోనే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిర్మాత షైన్ స్క్రీన్ ఇండియా ఎల్ఎల్పీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయగా.. నేడు, శుక్రవారం ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు షాకింగ్ తీర్పు నిచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది. మెరిట్స్ ఉంటే సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని చెబుతూ అప్పీల్లో విచారణ ముగించింది. నిజానికి జనవరి 8 రాత్రి తెలంగాణ లో ప్రభాస్ రాజా సాబ్ సినిమా ప్రీమియర్ షో లు కూడా సాధారణ టికెట్ ధరలకే ప్రదర్శించవలసి వచ్చింది. దీనితో నిర్మాత తీవ్ర నిరాశ చెందారు
