సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో అందరి ద్రుష్టి ఫిబ్రవరి 01.. యూనియన్ బడ్జెట్ 2026. గురించే… కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటంతో అమెరికా అడ్జక్షుడు ట్రంప్ సుంకాల ప్రభావం నుండి భారత్ ఎగుమతుల రంగాన్ని ఎలా ఎలాంటి రాయితీ లు ఇచ్చి గట్టెక్కిస్తారు? డాలర్ తో పోలిస్తే సుమారు 92 రూపాయలకు దారుణంగా పడిపోయిన రూపాయి విలువను ఎలా సమర్ధించుకొంటారు? అన్న విశ్లేషణ కంటే ఈ సారి, నిత్యావసరాలు ధరలు తగ్గించే చర్యలు ఏమిటి ? ఆదాయపన్ను పరిధి నుండి ఆమె మధ్య తరగతి ప్రజలను ఈసారి పెద్ద ఎత్తున కనికరిస్తారు అని విశ్లేషకులు భావిస్తునారు. బడ్జెట్ ప్రదర్శన సమయంలో వ్యవధి పరంగా.. నిర్మలా సీతారామన్ 2020-21లో ఇప్పటికే ఓ రికార్డును కలిగి ఉన్నారు. నాడు ఆమె 2 గంటల 42 నిమిషాలు ప్రసంగించగా.. ఇదే ఎక్కువ సేపు బడ్జెట్ ప్రసంగంగా ఉంది. ఈసారి ఆ రికార్డ్ బద్దలయ్యే అవకాశముంది. ఎందుకంటే.. ఇప్పుడు రైల్వే బడ్జెట్ కూడా సాధారణ బడ్జెట్‌లో కలిసిపోయింది. కాబట్టి బడ్జెట్ ప్రసంగం అంత చిన్నదిగా ఉండే అవకాశాలు చాలా తక్కువ అని ఆర్థిక నిపుణుల అభిప్రాయం.
