సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ది భీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్, భవనంలో నేటి శనివారం ఉదయం లేబర్ డిపార్ట్ మెంట్ వారు ప్రధానమంత్రి శ్రమ యోగి మాన ధన్ (PM-SYM), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కార్మిక శాఖ అసంఘటిత కార్మికులకు మరియు చిరు వ్యాపారులకు పెన్షన్ పథకము గురించిన అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ అవగాహన సదస్సు లో లేబర్ డిప్యూటీ కమీషనర్ గారు, లేబర్ ఆఫీసర్స్ పాల్గొని సదస్సు లో కార్మికులు కు, వ్యాపారస్తులకు అసంఘటిత కార్మికులకు మరియు చిరు వ్యాపారులకు పెన్షన్ పథకం గురించి సవివరముగా తెలిపారు. అనంతరము లేబర్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస రావు ని, వన్ టౌన్ లేబర్ ఆఫీసర్ మహేశ్వర్ రెడ్డిని, టూ టౌన్ లేబర్ ఆఫీసర్ కిరణ్ కుమార్ ను చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున సత్కరించారు. ఈ కార్యక్రమంలో చాంబర్ కార్యదర్శులు కాగిత వెంకటరమణారావు , సంగడి వీర వెంకట శివ సత్యనారాయణ (బుజ్జి ), R. V.ప్రసాద్ రావు, సుంకర చినబాబు, కోశాధికారి కురిసేటి కుమార్ బాబు, సభ్యులు పెరుమాళ్ళ రాజా, చిన్ని బాబు రావు , G. K. V. V. ప్రసాద్, A. చలపతి , మానేపల్లి ప్రవీణ్ ,ఇంకను CITU నాయకులు రాజా రామ్మోహన్ రాయ్, బి వాసుదేవరావు,సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.
