సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మన శంకరవరప్రసాద్‌గారు’ విజయం తో మెగాస్టార్‌ చిరంజీవి. మరల తదుపరి చిత్రాల విషయంలోనూ స్పీడ్‌ పెంచారు చిరు. ప్రస్తుతం ఆయన చేతిలో శ్రీకాంత్‌ ఓదెల, కొల్లి బాబీ దర్శకత్వంలో సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా గతంలో రిలీజ్ కాకుండా నిలిచిపోయిన బింబిసారా పేమ్.. వశిష్ఠ దర్శకత్వం వహించిన ఫాంటసీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘విశ్వంభర’ (Vishwambhara)చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది. గతేడాదే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్‌ పనుల వల్ల ఆలస్యమైంది. మొదట మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం జులై 9న ఈ సినిమాను విడుదల చేయడానికి యువి. క్రియేషన్స్‌ సంస్థ సన్నాహాలు చేస్తుంది, ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్‌గా హీరోయిన్స్ గా నటించారు. ఈ విషయంపై చిరంజీవి కూడా ఇటీవల నిర్ధారించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *