సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్పటి వరకు ప్రతి బుధవారం నరసాపురం నుండి భీమవరం మీదుగా అరుణాచలం కు (తిరువణ్ణామలై) ఇటీవల ప్రత్యక రైలు ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దక్షిణ మధ్య రైల్వే కాకినాడ టౌన్‌, తిరువణ్ణామలై మధ్య మరిన్ని స్పెషల్‌ ట్రైన్స్‌ నడపనున్నట్లు తెలిపింది. దీనితో మరో రైలు మన పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు భీమవరం తణుకు మీదుగా వెళ్లే ట్రైన్ అందుబాటులోకి రానుంది. రైలు నంబర్‌ 07617, కాకినాడ టౌన్ నుంచి తిరువణ్ణామలైకు శనివారం(14.02.2026) సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరసటి రోజు ఉదయం 6.30 గంటలకు చేరుకుంటుంది. రైలు నంబర్‌ 07618 తిరువణ్ణామలై నుంచి కాకినాడ టౌన్ సోమవారం (16.02.2026) ఉదయం 3 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 8.30 గంటలకు చేరుకుంటుంది.ఈ ప్రత్యేక రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, స్టేషన్లు లో రెండు దిశలలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 1AC కమ్ 2AC, 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *