సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ అమ్మవారి మాఘ బహుళ చవితి నుండి అనగా ఈ నెల 5 వ తేది గురువారం నుండి ఉత్సవాలలో భాగంగామాఘ బహుళ దశమి అనగా 12 వ తేది గురువారం వరకు శ్రీ అమ్మవారు అష్టలక్ష్మి అలంకరణలలో, భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాలలో చివరి రోజు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లక్ష మంది భక్తులకు అన్నసమారాధన జరిగే రోజు ఈనెల 13 వ తేదీన మాఘ బహుళ ఏకాదశి శుక్రవారం నాడు శ్రీ అన్నపూర్ణా దేవి అలంకరణ లలో శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవ సంబరాలలో భక్తులను అనుగ్రహించనున్నారు.. అని దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ తెలిపారు. భక్తులు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి సిరి సంపదలు, సుఖ సంతోషాలతో భక్తులు, వారి కుటుంబం వర్ధిల్లగలరు అని అసిస్టెంట్ కమీషనర్ &కార్యనిర్వహణాధికారి బుద్ద మహాలక్ష్మి నగేష్ మరియు చైర్మన్ బొండాడ నాగభూషణం ,ధర్మకర్తలు మండలి సభ్యులు కోరారు.
