సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎప్పుడు వివాదాలకు దగ్గరగా ఉండే మోహన్‌బాబు యూనివర్సిటీ తాజగా మరో వివాదంలో చిక్కుకుంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేసేందుకు వెళ్తున్న విద్యార్థి సంఘాల నేతలపై యూనివర్సిటీకి చెందిన 20 మంది బౌన్సర్లు మూడు ఇన్నోవా వాహనాల్లో వచ్చి వారిపై దాడికి పాల్పడి, ఇద్దరిని కిడ్నాప్ చేయడం గత మంగళవారం తిరుపతిలో సంచలనం సృష్టించింది.. రంగంలోకి దిగిన పోలీసులు.. విద్యార్థి నేతలను కాపాడారు. తాజా సమాచారం ప్రకారం… నలుగురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో సూత్రధారులుగా భావిస్తున్న వర్సిటీ యజమానులైన మోహన్‌బాబు, ఆయన కుమారుడు విష్ణు, ఎంబీయూ పీఆర్వో సతీశ్‌కుమార్ సహా 23 మందిపై తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంబీయూలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ రెండ్రోజుల కిందట విద్యార్థి సంఘాల నేతలు గవర్నర్‌కు, విద్యా మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం తిరుపతి ఎన్టీఆర్ కూడలిలో ఎంబీయూ దిష్టిబొమ్మ దహనానికి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్‌ఎ్‌సయూఐ సంఘాల నాయకులు ప్రయత్నించారు.
