సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా వెయ్యి కోట్ల పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసిపై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి ఉంది. తోలి భారతీయ ఐమాక్స్ పార్మెట్ లో నిర్మిస్తున్న ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచర్ నేపథ్యంతో రూపొందుతోంది. 2025 నవంబర్‌లో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ వీడియోలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు. ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే తెలివైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. వీరు కాకుండా తమిళ్ కు చెందిన ఒక స్టార్ హీరో ( చియాన్ విక్రమ్?) కూడా నటిస్తున్నట్లు, 3న్నర గంటల నిడివితో ఒకే పార్ట్ సినిమాగా రిలీజ్ అవుతున్నట్లు ఫిల్మ్ నగర్ వార్త! ఇందులో శ్రీ రామచంద్రునిగా మహేష్ బాబు కొద్దీ నిమిషాల ఎపిసోడ్ సినిమాకు హైలైట్ కానుంది. ఇదిలా ఉండగా ప్రేక్షకులు ఈ సినిమా రిలీజ్ 2027 ఏప్రిల్ 7న అధికారికముగా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *