సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, నేడు, బుధవారం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ‘రేర్ ఎర్త్ కారిడార్’ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చబోతోందని పేర్కొన్నారు. ఈ కారిడార్ ద్వారా ఏపీని హై-టెక్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్ది, ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనలో రాష్ట్రాన్ని భాగస్వామిని చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పారిశ్రామి కాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి లోకేష్‌కు హామీ ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు తన నివాసం లో కేంద్ర మంత్రి వర్మ ఆత్మీయ ఆతిథ్యం ఇవ్వడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *