సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి జిల్లాలో గత నెల రోజులుగా కేజీ 300 రూ కు పెరిగిపోయిన స్కీన్ లెస్ చికెన్ ధరలు భారీగా దిగొస్తున్నాయి. గత 3రోజులుగా చికెన్ ధర రూ.80మేర తగ్గింది. పండుగ సీజన్ ముగియడం, కోళ్ల ఫారాల్లో ఉత్పత్తి పెరగడంతో ధరలు తగ్గుతూ వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.గత 7 రోజులుగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం కిలో చికెన్ రూ 220 – 240కే లభిస్తోంది. రిటైల్ మార్కెట్‌లో లైవ్ చికెన్ రూ.140గా కొనసాగుతోండగా.. డ్రెస్‌డ్ రూ.220గా ఉంది. స్కిన్‌లెస్ కేజీ చికెన్ రూ.240 పలుకుతోంది. ప్రాంతాలను బట్టి ధరల్లో అటుఇటుగా మార్పులు ఉంటాయి. అలాగే కోడి గూడ్ల హోల్ సెల్ ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. గత నెలలో 30 గుడ్లు 270 రూ చేరుకోగా తాజగా 100 రూపాయలు తగ్గి 170 -160 కె లభ్యం అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *