సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: జై శ్రీరామ్ నినాదాలతో తణుకు పట్టణం మారుమ్రోగింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు బీసీ కల్యాణమండపం వద్ద సత్య సాయిబాబా వారి మందిరం వద్ద అయోధ్య రామయ్య కి అందించేందుకు 17 కేజీల బంగారం తో అమూల్య రాళ్లు పొదిగి సుందరంగా తయారుచేసిన విల్లును ప్రత్యక ఏర్పాట్లతో ప్రదర్శించారు. సాక్షాత్తు శ్రీ రాముని జన్మస్థలం అయ్యోద్య రామాలయానికి తరలి వెళుతున్న బంగారు ధనుస్సు ఇక్కడకు రావడం దానిని చూడటం తమ జన్మ ధన్యం అయ్యిందని రామ భక్తులు భావిస్తున్నారు.
