సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం భీమవరం నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే లో ప్రజల నుంచి 97 అర్జీలను నియోజకవర్గ పార్టీ ఇంచార్జి, తోట సీతారామలక్ష్మి స్వీకరించారు. ప్రజల ఇచ్చిన అర్జీలను పరిశీలించి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చి వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నమని ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధసారధి మాట్లాడుతూ.. ఈరోజు వచ్చిన అర్జీలలో ఎక్కువ శాతం పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల గురించి వచ్చాయని ప్రతి ఒక్క అర్జీని పరిశీలించి సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కు, నియోజకవర్గ,ము కు చెందిన టీడీపీ నేతలు పార్టీ ఇన్చార్జులు నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *