సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అయ్యాయి. గత సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాద ఘటనలో 25 ఏళ్ళు పైగా వయస్సు ఉన్న మూగ్గురు యువకులు తలలు పగిలి రోడ్డు ఫై దారుణంగా మరణించారు. ఏలూరు బీడీ కాలనీ చెరువుగట్టుకు చెందిన బొంతు దుర్గాప్రసాద్, చిట్టి ఆంజనేయులు, షేక్ అహ్మద్ వలీ స్నేహితులు. దుర్గాప్రసాద్ పెట్రోల్ బంకులో పనిచేస్తుండగా, అహ్మద్, ఆంజనేయులు తాపీ పని కార్మికులు. సోమవారం ఉదయం విజయరాయి వెళ్లిన ముగ్గురు మధ్యలో మద్యం సేవించినట్లు? భావిస్తున్నారు.సాయంత్రం మద్యం మత్తులో నిర్లక్ష్యంతో వేగంగా బైక్ నడిపినట్లు తెలుస్తోంది. సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల బస్సు జానంపేట వైపు వెళుతోంది. దానిని బైక్ ఢీ కొనడంతో ముగ్గురు యువకుల ప్రాణాలు గాలిలో కలిసాయి. పోలీసులు చిధ్రమైన మృతదేహాలను పోస్టుమార్డం పరీక్షకు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి ప్రాంగణం మృతుల భార్య పిల్లలు బంధువుల రోదనలతో విషాద భరితంగా ఉంది.
