సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇరాన్ తీవ్ర ప్రతీకార దాడులతో గల్ఫ్ ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అరబ్ దేశాల అధినేతలతో నేడు, మంగళవారం ఫోన్‌లో చర్చలు జరిపారు. గల్ఫ్ దేశాలపై దాడులు ను ఖండించారు.. అక్కడి భారతీయుల భద్రత, సంక్షేమంపై కూడా చర్చించారు. ఒమాన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిఖ్, కువైత్ యువరాజు షేఖ్ సబా , ఖతర్ ఎమిర్ షేఖ్ తమీమ్, జోర్డాన్ రాజులతో ప్రధాని ఫోన్‌లో మాట్లాడారని,యుద్ధం ఆపడానికి అవకాశాలు ఫై చర్చించారు. అధికార వర్గాలు తెలిపాయి.. బహ్రెయిన్, సౌదీ అరేబియా పాలకులతో కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ క్లిష్ట సమయంలో భారత్ గల్ఫ్ దేశాల పౌరులకు అండగా ఉంటుందని కూడా హామీ ఇచ్చారు. అక్కడి పరిస్థితి గురించి ఆరా తీశారు. పశ్చిమాసియా, సౌదీ, కువైట్ , ఖతార్ వంటి గల్ఫ్ దేశాల్లో సుమారు కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇరాన్‌లో 10 వేల మంది చదువు, ఉద్యోగాల కోసం ఉంటుండగా, ఇజ్రాయెల్‌లో 40 వేల మంది భారతీయులు ఉంటున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియా గగనతలం మీదుగా వేలాది విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో, అనేక మంది భారతీయులు దుబాయ్, దోహా సహా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఈ విషయమై ప్రధాని మోడీ క్యాబినెట్ మంత్రులతో చర్చలు జరుపుతున్నారు.
